Header Banner

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

  Sun Feb 02, 2025 10:38        Politics

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ 2025-26 ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (PMDDKY) అనే పథకాన్ని ప్రకటించారు. ఇది రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనీ, వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా.. దేశవ్యాప్తంగా.. రాష్ట్రాల్లో తక్కువ దిగుబడి, తక్కువ ఆదాయం వస్తున్న 100 జిల్లాల్ని ఎంపిక చేస్తారు. ఈ జిల్లాలకు ప్రత్యేకంగా డబ్బు ఇస్తారు. ఆ డబ్బు రైతులకు చేరుతుంది. తద్వారా వారి వ్యవసాయ దిగుబడి పెరిగి, ఆదాయం పెరగనుంది. దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు ఈ పథకం ప్రయోజనం కలిగించనుంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పథకం ద్వారా రైతులకు మనీ ఇవ్వడమే కాదు.. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల పొలాలను పరిశీలిస్తారు. భూసార పరీక్షలు చేస్తారు. ఏయే పంటలు వెయ్యాలో చెబుతారు, ఎలా వెయ్యాలో సూచనలు చేస్తారు. ప్రకృతికి హాని కలగకుండా.. వ్యవసాయంలో ఏయే మార్పులు తేవాలో చెప్పి, తద్వారా దిగుబడి పెరిగేలా చేస్తారు. అలాగే పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని నిల్వ చెయ్యడం, ఎక్కువ ధరకు అమ్ముకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెడతారు. పంచాయతీల్లోనే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ల సౌకర్యాలు కల్పిస్తారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


దేశంలో చాలా పొలాలకు నీరు సరిగా లేకపోవడం వల్ల దిగుబడి సరిగా ఉండట్లేదు. అందువల్ల ఎంపిక చేసిన జిల్లాల్లో రైతులకు నీటి సదుపాయం పెరుగుతుంది. అలాగే.. దిగుబడి పెరగడానికి ఏయే మార్పులు అవసరమో అవన్నీ అధికారులూ, వ్యవసాయ శాస్త్రవేత్తలూ కలిసి చేపడతారు. రైతులకు రుణాలు వచ్చేలా చేస్తారు. సబ్సిడీ లోన్స్ ఇప్పిస్తారు. మైక్రోఫైనాన్స్ అవకాశాల ద్వారా.. రైతులు తమకు కావాల్సిన యంత్ర పరికరాలు కొనుక్కునేలా చేస్తారు. అర్హతలు: ఈ పథకం పొందాలంటే రైతులు తప్పనిసరిగా.. భారతీయులై ఉండాలి. వ్యవసాయం చేస్తూ ఉండాలి. తక్కువ దిగుబడి వచ్చే 100 జిల్లాల్లో ఎక్కడో ఒకచోట నివసిస్తూ ఉండాలి. అలాంటి రైతులకు ఈ పథకం ద్వారా చాలా ప్రయోజనాలు కలగబోతున్నాయి.
కావాల్సిన పత్రాలు: ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని అవసరమైన పత్రాలు కలిగివుండాలి. అవి ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన పాస్ పుస్తకం, ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో కలిగివుండాలి. అలాగే.. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా కావాలని అడిగే అవకాశాలు ఉన్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 



దరఖాస్తు ప్రక్రియ: ఈ పథకానికి రైతులు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. త్వరలోనే వీటిని విడుదల చేసి, దరఖాస్తు ప్రక్రియ చేపట్టనుంది. అందువల్ల రైతులు.. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను గమనిస్తూ ఉండాలి. లేదా న్యూస్18తెలుగును చూస్తూ ఉండాలి. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చెయ్యగానే.. న్యూస్18 తెలుగు ఆ వివరాల్ని ప్రచురిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: అర్హులైన రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://agriwelfare.gov.in లోకి వెళ్లాలి. ఈ సైట్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే లాగిన్ అవ్వడానికి వీలవుతుంది. ఇది పూర్తైపోతే, కేంద్రం ఎప్పుడు దరఖాస్తులను ఆహ్వానిస్తే, అప్పుడు వెంటనే లాగిన్ అయ్యి, దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఇదే కాదు.. కేంద్రం తెస్తున్న చాలా పథకాలకు ఈ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #formers #unionbudget #todaynews #flashnews #latestupdate